Vanajeevi Ramaiah: వనజీవి రామయ్యకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స!

Vanajeevi Ramaiah injured in bike accident
  • మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఢీకొన్న బైక్
  • ప్రమాదంలో విరిగిన రామయ్య కాలు
  • ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య

ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, వనజీవి, పద్మశ్రీ రామయ్య ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య ఈ ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్ పై వెళ్తున్నారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ఒక బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు కాలు విరిగింది. 

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎనిమిది పదుల వయసులో ఉన్న రామయ్య ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పుడు ఆయనకు కాలు విరగడం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News