Yogi Adityanath: లక్నో పేరును మార్చే యోచనలో యూపీ సర్కారు.. ట్వీట్ తో క్లూ ఇచ్చిన యోగి?

lucknow name to be chaged speculation by yogi tweet
  • ల‌క్నో పేరును లక్ష్మణ్ పురి లేక లఖన్ పురిగా మార్చాలని చాలా కాలంగా డిమాండ్ 
  • నిన్న నేపాల్ నుంచి లక్నోకు మోదీ
  • లక్ష్మణుడి  పావన నగరమైన‌ లక్నో అంటూ యోగి ట్వీట్
  • మోదీకి ఆ నగరం స్వాగ‌తం ప‌లుకుతోంద‌ని వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్‌ రాజధాని ల‌క్నో పేరును లక్ష్మణ్ పురి లేక లఖన్ పురిగా మార్చాలని చాలా కాలంగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ‌రాముడి సోద‌రుడు లక్ష్మణుడికి గుర్తుగా ఇప్ప‌టికే ల‌క్నోలో లక్ష్మణ్ తిలా, లక్ష్మణ్ పురి, లక్ష్మణ్ పార్క్ వంటివి ఉన్నాయి. తాజాగా, ల‌క్నో పేరు మార్పు అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఆ అంశంపై చేసిన ట్వీటే ఇందుకు కార‌ణం. 

నేపాల్ లో ప‌ర్య‌టించిన‌ ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి నిన్న సాయంత్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లక్నో చేరుకోగా, ఆయ‌న‌కు ఆహ్వానం పలుకుతూ ఓ ఫొటోను యోగి ఆదిత్య‌నాథ్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా 'శేషావతారుడు భగవాన్ లక్ష్మణుడి పావన నగరమైన‌ లక్నో.. మోదీకి స్వాగ‌తం ప‌లుకుతోంది' అంటూ యోగి పేర్కొన్నారు. 

దీంతో త్వ‌ర‌లోనే లక్నో పేరును లక్ష్మణ్ పురిగా మార్చునున్నారనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ట్వీట్ తో యోగి ఆదిత్యనాథ్ క్లూ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లక్ష్మణుడి భవ్య మందిరం నిర్మాణ ప‌నులు ఇప్ప‌టికే లక్నోలో జ‌రుగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని యోగి ప్ర‌భుత్వం గతంలో అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్ గా, ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చిన విష‌యం తెలిసిందే. మ‌రికొన్ని న‌గ‌రాల పేర్ల‌ను మార్చాలంటూ డిమాండ్లు ఉన్నాయి.
Yogi Adityanath
BJP
Uttar Pradesh

More Telugu News