Work From Home: ‘వర్క్ ఫ్రం హోం’లో తన అనుభవాలు చెప్పిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Britain PM Boris Johnson Remember his Work From Home Experience
  • వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుందన్న జాన్సన్
  • దృష్టంతా కాఫీపైనే ఉంటుందన్న ప్రధాని
  • ఆ తర్వాత స్నాక్స్ కోసం వెళ్తామన్న జాన్సన్
  • వచ్చేసరికి చేస్తున్న పనేంటో మర్చిపోతామన్న బోరిస్
  • తన మాటలు కొందరికి నచ్చకపోవచ్చన్న బ్రిటన్ ప్రధాని
కరోనా కాలంలో కార్యాలయాలన్నీ మూతబడడంతో సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోం బాట పట్టాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ఇప్పుడు వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గడంతో చాలా సంస్థలు తిరిగి కార్యాలయాలు తెరుస్తూ ఉద్యోగులను రప్పించుకుంటున్నాయి. ఇంకొన్ని మాత్రం ఇంకా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఇస్తున్నాయి. 

అయితే, వర్క్ ఫ్రం హోం సత్ఫలితాలను ఇస్తుందా? కార్యాలయంలో పనిచేసినప్పటిలానే ఉత్పాదకత వస్తోందా? అన్న ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 

వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుందని చెప్పిన జాన్సన్.. పని మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ స్నాక్స్‌ తెచ్చుకోవడానికి అలా నడుచుకుంటూ రిఫ్రిజిరేటర్ వద్దకు వెళ్తామని, తిరిగి నిదానంగా వస్తూ ల్యాప్‌టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేంటో కూడా మర్చిపోతామని అన్నారు. 

అందుకే, మళ్లీ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తన మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చని, మన చుట్టూ ఇతర ఉద్యోగులు కూడా ఉన్నప్పుడు మన నుంచి మరింత ప్రొడక్టివిటీ వస్తుందని బోరిస్ జాన్సన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, మరింత ఉత్సాహం, కొత్తకొత్త ఐడియాలతో పనిచేస్తామని తాను విశ్వసిస్తానని వివరించారు.
Work From Home
Boris Johnson
Britain

More Telugu News