India: చల్లటి కబురు.. రానున్న 24 గంటల్లో భారత్ లో ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు!

  • 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
  • నెలాఖరులోగా కేరళను తాకనున్న వైనం
  • జూన్ 8 నాటికి తెలంగాణలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
Monsoons to enter India within 24 hours

భారీ ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. రానున్న 24 గంటల్లో ఇండియాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపింది. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని.... ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాదులో భారీ వర్షం కురిసింది.

More Telugu News