మాతృ దినోత్సవం మాదిరే భార్యా దినోత్సవం జరుపుకోవాలి: కేంద్ర మంత్రి అథవాలే
- తల్లి జన్మనిస్తుంది కాబట్టే మాతృ దినోత్సవమన్న అథవాలే
- భర్త మంచి, చెడులలో భార్య పాలుపంచుకుంటుందని వ్యాఖ్య
- ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్న కేంద్రమంత్రి
తల్లి జన్మనిస్తున్న కారణంగా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం... భర్త మంచి, చెడులలో భార్య పాలుపంచుకుంటుందని, అందుకే మాతృ దినోత్సవం తరహాలోనే భార్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్ట్రీ ఉంటుందని చెప్పిన ఆయన... ఈ కారణంగానే భార్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలిపారు.