TDP: రాజ‌కీయ విశ్లేష‌కుడు న‌ర‌సింహారావు కుటుంబానికి చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌

chndrababu condolences to c narasimha rao family
  • హైద‌రాబాద్‌లోని న‌ర‌సింహారావు ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు
  • న‌ర‌సింహారావు చిత్ర‌ప‌టానికి నివాళి
  • న‌ర‌సింహారావు భార్య‌, కుమారుడికి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత‌
ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు, వ్య‌క్తిత్వ వికాస పుస్త‌క ర‌చ‌యిత సి.న‌ర‌సింహారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌రామ‌ర్శించారు. ఆదివారం హైద‌రాబాద్‌లోని న‌ర‌సింహారావు ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు... ఆయ‌న ఫొటోకు నివాళి అర్పించారు. అనంత‌రం న‌ర‌సింహారావు స‌తీమ‌ణి, కుమారుడికి ధైర్యం చెప్పారు. 

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న న‌ర‌సింహారావు గ‌చ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాత్రి ఆయ‌న అనారోగ్యం విష‌మించ‌డంతో వైద్యులు అత్య‌వ‌స‌ర చికిత్స‌కు య‌త్నించారు. అయినా ఫ‌లితం లేక న‌ర‌సింహారావు బుధ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే.
TDP
Chandrababu
Hyderabad
C.Narasimha Rao

More Telugu News