Congress: చింత‌న్ శిబిర్‌లో డీకే శివ‌కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌లు

kpcc president birth day celebrations in chintan shivir
  • నేడు డీకే శివ‌కుమార్ బ‌ర్త్ డే
  • చింత‌న్ శిబిర్‌లోనే కేక్ క‌ట్ చేసిన డీకే
  • డీకేకు గ్రీటింగ్స్ చెప్పిన ఉత్త‌మ్‌
కాంగ్రెస్ పార్టీ క‌ర్ణాట‌క శాఖ(కేపీసీసీ) అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ ఆదివారం త‌న జ‌న్మ‌దినాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ వేదిక‌గా కొన‌సాగుతున్న పార్టీ చింత‌న్ శిబిర్‌కు హాజ‌రైన డీకే...అక్క‌డే పార్టీ నేత‌ల మ‌ధ్యే త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. పార్టీ కీల‌క స‌ద‌స్సులో నిమ‌గ్న‌మైన పార్టీ కీల‌క నేత‌లంతా డీకేకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. 

క‌ర్ణాట‌క‌కు చెందిన పార్టీ నేత‌లు ఏకంగా చింత‌న్ శిబిర్‌లోనే డీకేతో కేక్ క‌ట్ చేయించి మ‌రీ సంద‌డి చేశారు. తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కూడా డీకేకు బ‌ర్త్ గ్రీటింగ్స్ తెలియ‌జేశారు.
.
Congress
DK Shivakumar
Uttam Kumar Reddy
Birth Day
Chintan shivir

More Telugu News