CBI probe: ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ పై సీబీఐ దర్యాప్తు.. రెండు కేసులు నమోదు

  • దేశవ్యాప్తంగా నాలుగు పట్టణాల్లో సోదాలు
  • బెట్టింగ్ నెట్ వర్క్ నుంచి ఎలక్ట్రానిక్ డివైజ్ లు స్వాధీనం
  • పాకిస్థాన్ వ్యక్తులతో చాట్ చేసినట్టు ఆధారాలు
CBI probes IPL betting racket with Pakistan links files 2 FIRs

పాకిస్థాన్ శక్తుల ప్రోద్బలంతో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా నాలుగు పట్టణాల్లోని పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కొందరు వ్యక్తులతో కూడిన నెట్ వర్క్ పాకిస్థాన్ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సీబీఐ దృష్టి సారించింది. 

ఈ నెట్ వర్క్ 2013 నుంచి పనిచేస్తోందని, రాజస్థాన్ తో బలమైన లింక్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజా కేసుల్లో సీబీఐ జైపూర్, జోధ్ పూర్, హైదరాబాద్, ఢిల్లీ పట్టణాల్లో సోదాలు నిర్వహించింది. ఐపీఎల్ బెట్టింగ్ నెట్ వర్క్ సభ్యులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ లోని సభ్యులతో చాట్ చేసిన ఆధారాలు ఆయా డివైజ్ లలో ఉన్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై బెట్టింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్టు సమాచారం ఉందని పేర్కొన్నాయి.

More Telugu News