కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్ర.. రాహుల్ సైతం
- ప్రజలతో జనతా దర్బార్ కార్యక్రమం
- నిరుద్యోగం, ఇతర ప్రధాన సమస్యల ప్రస్తావన
- రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలకు చోటు
- ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు కార్యక్రమాలు
నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ప్రస్తావించనుంది. ఉదయ్ పూర్ లోని పార్టీ చింతన్ శిబిరంలో భాగంగా ఇందుకు సంబంధించి ‘జన జాగరణ్ అభియాన్‘ కార్యక్రమం చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రజలకు కాంగ్రెస్ ను చేరువ చేసేందుకు యూత్ కాంగ్రెస్ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేసినట్టు పేర్కొన్నాయి.
‘‘ఈ ప్రతిపాదన దాదాపుగా ఖాయమైనట్టే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపడుతుంది. ప్రజలను నేరుగా కలుసుకునే లక్ష్యంలో భాగంగా జనతా దర్భార్ లను కూడా నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది’’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.