Pulla Reddy Sweets: 'పుల్లారెడ్డి స్వీట్స్' ఏక్ నాథ్ రెడ్డిపై గృహహింస కేసు!

Case filed on Pulla Reddy Sweets grand son
  • తనను హింసిస్తున్నట్టు కేసు పెట్టిన భార్య
  • పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు
  • వరకట్న వేధింపులు, గృహహింస కేసుల నమోదు
తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ స్వీట్స్ ను జనాలు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తారు. దివంగత పుల్లారెడ్డి స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగువారికి ఎంతో ప్రీతికరంగా మారింది. ఇప్పడు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఈ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా వీరి కుటుంబంలో కలకలం రేగింది. రాఘవరెడ్డి కుమారుడు, పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. హైదరాబాదులోని పంజాగుట్ట పీఎస్ లో ఈ కేసు నమోదయింది. 

ఏక్ నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. గత కొంత కాలంగా ఏక్ నాథ్ రెడ్డి తన భార్యను హింసిస్తున్నట్లు సమాచారం. భార్యను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది. ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను కూడా కూడా నిర్మించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై వరకట్న వేధింపులు, గృహహింస కేసులు నమోదయ్యాయి. ఆయన భార్య కేసు పెట్టింది. పంజాగుట్ట పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Pulla Reddy Sweets
Grand Son
Case

More Telugu News