Cricket: ముంబై ఇండియన్స్ ఆటగాడికి చెన్నై సారథి ధోనీ అపురూప కానుక.. ఇదిగో వీడియో

MS Dhoni Gives A Special Gift For Mumbai Young Player
  • మొన్న ముంబై, చెన్నై మధ్య మ్యాచ్
  • ఘోరంగా ఓడిపోయిన చెన్నై
  • ముంబై గెలుపులో కార్తికేయ కీలక పాత్ర
  • బంతిపై సంతకం చేసిచ్చిన ధోనీ
యంగ్ ట్యాలెంట్ ను ప్రోత్సహించడంలో ధోనీ ఎప్పుడూ ముందే ఉంటాడు. మొన్న ముంబై ఇండియన్స్ తో ఆడిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయినా.. ఆ జట్టు సారథి ధోనీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ యంగ్ ప్లేయర్ కుమార్ కార్తికేయ సింగ్ ను అభినందించాడు. 2 వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన అతడికి ఓ అపురూప కానుకను ఇచ్చాడు. 

మ్యాచ్ అయిపోగానే ముంబై ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపిన ధోనీ.. కార్తికేయకు మాత్రం ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పాడు. సంతకం చేసిన బంతిని అతడికి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు.. ముంబై ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కు తాను సంతకం చేసిన చెన్నై జెర్సీలను కానుకగా అందించాడు. 

కాగా, కార్తికేయకు ధోనీ ఇచ్చిన కానుకపై ముంబై ఇండియన్స్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. మ్యాచ్ బాల్ ను ఎంఎస్ ధోనీ సైన్ చేసి ఇస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి అంటూ కామెంట్ చేసింది. ఐపీఎల్ లో ప్రతిభకు కొదవలేదంటూ కొనియాడింది.
Cricket
IPL
MS Dhoni
Kumar Kartikeya Singh

More Telugu News