Nagachaiyanya: 'థ్యాంక్యూ' మూవీ రిలీజ్ డేట్ ఖరారు!

  • 'బంగార్రాజు'తో హిట్ అందుకున్న చైతూ
  • ఆ తరువాత సినిమాగా రూపొందిన థ్యాంక్యూ' 
  • ముగ్గురు హీరోయిన్స్ తో చైతూ రొమాన్స్ 
  • జూలై 8వ తేదీన సినిమా విడుదల
Thank you movie release date confirmed

నాగచైతన్య నుంచి ఈ ఏడాది వచ్చిన 'బంగార్రాజు' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పల్లెటూరి బుల్లోడిగా ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'థ్యాంక్యూ' రానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ,  అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్  లో చైతూ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. చైతూ సరసన నాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ అలరించనున్నారు. 

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. త్వరలోనే అలా ఈ సినిమా నుంచి టీజర్లు .. ట్రైలర్లు .. లిరికల్ వీడియోల సందడి మొదలు కానుంది. ముగ్గురు హీరోలతో చైతూ రొమాన్స్ అనడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చైతూ ఆ తరువాత ప్రాజెక్టును పరశురామ్ తో చేయనున్నాడనే సంగతి తెలిసిందే..

More Telugu News