TDP: కుప్పం పర్యటన ముగించిన చంద్రబాబు... హైదరాబాద్‌కు పయనం

- మూడు రోజులుగా కుప్పంలోనే చంద్రబాబు
- 'బాదుడే బాదుడు'లో పాల్గొన్న టీడీపీ అధినేత
- పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన వైనం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటనను శుక్రవారం రాత్రి ముగించుకున్నారు. కుప్పం పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు... కాసేపటి క్రితం రోడ్డు మార్గం మీదుగా బెంగళూరు బయలుదేరారు. బెంగళూరు నుంచి ఆయన విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.
బుధవారం మధ్యాహ్నం కుప్పం చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ ఆధ్వర్యంలో సాగుతున్న బాదుడే బాదుడు నిరసనల్లో పాలుపంచుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు.