BJP: రేపు తెలంగాణ‌కు అమిత్ షా... బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌రు

amit shah tour in telangana tomorrow
  • రేపు ముగియ‌నున్న బండి సంజ‌య్ పాద‌యాత్ర‌
  • తుక్కుగూడ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌
  • స‌భ‌కు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజ‌రు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ‌నివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర శ‌నివారంతో ముగియ‌నుంది. ఇప్ప‌టికే తొలి విడ‌త యాత్ర‌ను మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ముగించ‌గా... ఆ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ప్ర‌జా సంగ్రామ యాత్ర రెండో ద‌శ‌ను కూడా బండి సంజ‌య్ శ‌నివారం ముగించ‌నున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని తుక్కుగూడ‌లో బీజేపీ ఓ భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ స‌భ‌కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు.
BJP
Bandi Sanjay
Amit Shah
Telangana

More Telugu News