Rajanna Dora: లబ్ధిదారుల నోట మరోసారి వాలంటీర్ పేరు వినిపిస్తే సస్పెండ్ చేయిస్తా: అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర హెచ్చరిక

Deputy CM Rajanna Dora warns officers
  • పథకాలను ఎవరిస్తున్నారని ప్రశ్నించిన రాజన్న దొర
  • వాలంటీర్లు ఇస్తున్నారని సమాధానం చెప్పిన అధికారులు
  • అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
ఏపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో అధికారులపై డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వ పథకాలను ఎవరిస్తున్నారంటూ అడిగిన ఓ ప్రశ్నకు... వాలంటీర్ ఇస్తున్నాడంటూ లబ్ధిదారులు సమాధానమిచ్చారు. దీంతో, రాజన్న దొర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు పేరు వినిపించేదని... అదే మాదిరి ఇప్పుడు పథకాలను జగన్ ఇస్తున్నారని చెప్పాలని... కానీ, లబ్ధిదారులు పదేపదే వాలంటీర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇంకొక సారి లబ్ధిదారుల నోటి నుంచి వాలంటీర్ అనే పదం వినిపిస్తే సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు ఈ సందర్భంగా ఆయన క్లాసు పీకారు.
Rajanna Dora
YSRCP
Jagan
Chandrababu
Telugudesam

More Telugu News