Revanth Reddy: ఎవని పాలయిందిరో తెలంగాణ.. జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ: రేవంత్ రెడ్డి

revant reddy slams  kcr ktr
  • గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదని వ్యాఖ్య‌
  • టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున భూమి ఇచ్చార‌ని ఫైర్
  • రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి  భూమి ఉందని వ్యాఖ్య‌
తెలంగాణ స‌ర్కారుపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ''దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణ… జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ'' అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ కు భూమి కేటాయిస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్వ‌ర్వును ఆయ‌న పోస్ట్ చేశారు. హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కోసం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర స‌ర్కారు కేటాయించిందని, అది హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట మండలం ఎన్బీటీ నగర్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 వద్ద సర్వే నంబర్‌ 18/పీ, 21/పీలో ఉంద‌ని అందులో ఉంది. 

మ‌రోవైపు, పాలమూరు నుంచి ప్ర‌జ‌ల వ‌ల‌స‌లు ఆగ‌ట్లేద‌ని రేవంత్ రెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. ''అయ్యాకొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగునపడ్డాయి. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు. పాలమూరు పచ్చబడ్డదన్నది జూటామాట. సందేహం ఉంటే క్షేత్రానికి వెళ్లి నిజనిర్ధారణ చేద్దాం. వచ్చే దమ్ముందా కేటీఆర్!?'' అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.
Revanth Reddy
KTR
KCR
Telangana
Congress
TRS

More Telugu News