వాష్‌రూమ్‌లో విగత జీవిగా కనపడిన పీజీ విద్యార్థిని
- నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
- కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత
- గైనకాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని
- గత రాత్రి ఆసుపత్రిలో పని చేసి, అక్కడే పడుకున్న శ్వేత
గత రాత్రి ఆసుపత్రిలో పని చేసి, తెల్లవారు జామున 3 గంటలకు విశ్రాంతి గదిలో పడుకుంది. అయితే, ఈ రోజు ఉదయం తోటి సిబ్బంది ఆమె కోసం చూస్తే కనపడలేదు. చివరకు వాష్‌రూమ్ లో ఆమె విగత జీవిగా కనపడడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి మృతి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.