వాష్‌రూమ్‌లో విగత జీవిగా క‌న‌ప‌డిన పీజీ విద్యార్థిని

pg student dies in hospital
  • నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుప‌త్రిలో ఘ‌ట‌న‌
  • కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్వేత 
  • గైనకాలజీ పీజీ ద్వితీయ సంవ‌త్స‌రం చదువుతోన్న విద్యార్థిని
  • గ‌త‌ రాత్రి ఆసుప‌త్రిలో ప‌ని చేసి, అక్క‌డే ప‌డుకున్న శ్వేత‌
వాష్‌రూమ్‌లో విగత జీవిగా క‌న‌ప‌డింది ఓ పీజీ విద్యార్థిని. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుప‌త్రిలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే... కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్వేత అనే అమ్మాయి గైనకాలజీ పీజీ ద్వితీయ సంవ‌త్స‌రం చదువుతోంది. 

గ‌త‌ రాత్రి ఆసుప‌త్రిలో ప‌ని చేసి, తెల్ల‌వారు జామున 3 గంటలకు విశ్రాంతి గ‌దిలో పడుకుంది. అయితే, ఈ రోజు ఉదయం తోటి సిబ్బంది ఆమె కోసం చూస్తే క‌న‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు వాష్‌రూమ్ లో ఆమె విగత జీవిగా క‌న‌ప‌డ‌డంతో పోలీసులకు స‌మాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి మృతి ఈ ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు.
Go Back to Shorts
student
Nizamabad District

More Telugu News