Shilpa Shetty: "బోరు కొడుతోంది" అంటూ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించిన శిల్పా శెట్టి

Shilpa Shetty said she quits social media due to boredom
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్పాశెట్టి
  • సోషల్ మీడియాలో అంతా ఒకేలా ఉంటోందని వెల్లడి
  • కొత్తదనం కనిపించడంలేదని వివరణ

హిందీ సినిమాలతో పాటు, తెలుగు వంటి ప్రాంతీయ భాషల చిత్రాల్లోనూ నటించిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్టు శిల్పాశెట్టి వెల్లడించింది. దీనిపై తనే వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఏది చూసినా ఒకేలా అనిపిస్తోందని, తనకు బోరు కొడుతోందని తెలిపింది. 

మరో కొత్త అవతారం ఎత్తేంత వరకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. శిల్పాశెట్టి పెళ్లయిన తర్వాత ఫిట్ నెస్ వీడియోలు, యోగా కార్యక్రమాలు, రియాల్టీషోలతో బిజీగా మారింది.

  • Loading...

More Telugu News