ఎయిరిండియా ఎండీ, సీఈవోగా క్యాంప్ బెల్ విల్సన్ నియామకం
- ఇటీవల ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా
- తాజాగా కీలక నియామకం
- విమానయాన రంగంలో క్యాంప్ బెల్ విల్సన్ కు సుదీర్ఘ అనుభవం
50 ఏళ్ల క్యాంప్ బెల్ విల్సన్ కు విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది. విల్సన్ ఇప్పటివరకు సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ స్కూట్ కు సీఈవోగా వ్యవహరించారు. టాటాల అధీనంలోని ఎయిరిండియా సంస్థకు తనను ఎండీ, సీఈవోగా నియమించడం పట్ల క్యాంప్ బెల్ విల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.