Mumtaz: పవన్ కల్యాణ్ సినిమా 'ఖుషి'లో నటించిన ముంతాజ్ పై కేసు నమోదు!

Police case filed against actress Mumtaz
  • ముంతాజ్ పై గృహహింస కేసు నమోదు
  • ముంతాజ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు
  • తమను హింసిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ ను ఉచ్ఛ స్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఖుషి'ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా ముంతాజ్ నటించి మెప్పించింది. తెలుగులో పలు సినిమాల్లో పలు ఐటెం సాంగులు చేసిన ముంతాజ్... తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. తాజాగా ఆమెపై గృహహింస కేసు నమోదయింది.

వివరాల్లోకి వెళ్తే, ముంతాజ్ ప్రస్తుతం చెన్నైలోని అన్నానగర్ ఉంటోంది. ఆమె ఇంట్లో కొన్నేళ్లుగా ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పని చేస్తున్నారు. వీరిలో ఒక బాలిక ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంతాజ్ తమను వేధిస్తోందని, తమను సొంత ఊరికి కూడా పంపడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ప్రతి రోజు చిత్ర హింసలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. 

బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరోవైపు ముంతాజ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై ముంతాజ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
Mumtaz
Tollywood
Kollywood
Police Case

More Telugu News