రైలు కింద పడబోయిన మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో
- ఒడిశాలోని భువనేశ్వర్ లో ఘటన
- కదులుతోన్న రైలు నుంచి దిగబోయిన మహిళ
- పట్టుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడబోయిన వైనం
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రైలు కదులుతోన్న సమయంలో ఓ మహిళ దిగబోతుండగా పట్టుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడబోయింది. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి కానిస్టేబుల్ ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగడంతో ప్రాణాపాయం తప్పింది. సదరు కానిస్టేబుల్‌పై అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. రైల్వే స్టేషన్లలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.