C.Narasimha Rao: వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ప్రముఖ సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూత

Political and Social analyst C Narasimha Rao Passes Away
  • హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో పుస్తకాలు రాసిన నరసింహారావు
  • నేటి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు
వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాసిన ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

నరసింహారావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 29 డిసెంబరు 1948లో జన్మించారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


C.Narasimha Rao
Social Analyst
Passed Away
Andhra Pradesh
Telangana

More Telugu News