Telangana: కర్ణాటక ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీకి తెలంగాణ ఫిర్యాదు

  • అప్ప‌ర్ తుంగ‌, అప్ప‌ర్ భ‌ద్ర‌త‌ల నిర్మాణం ఆపాలని కోరిన తెలంగాణ 
  • కృష్ణా న‌ది నుంచి తుంగ‌భ‌ద్ర‌కు వ‌ర‌ద నీరు తగ్గుతోందని వెల్లడి 
  • ఫ‌లితంగా దిగువ రాష్ట్రమైన త‌మ‌కు అన్యాయ‌మ‌న్న తెలంగాణ‌
telangana compailnt ro cwc over karnataka

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో క‌ర్ణాట‌కపై కేంద్ర జ‌ల సంఘం (సీడ‌బ్ల్యూసీ)కు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కేంద్ర జ‌ల సంఘానికి బుధ‌వారం ఓ లేఖ రాశారు. తుంగ‌భ‌ద్ర‌పై క‌ర్ణాట‌క ప్రభుత్వం నిర్మిస్తున్న అప్ప‌ర్ తుంగ‌, అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాలంటూ ఆ లేఖలో తెలంగాణ కోరింది.

కృష్ణా న‌ది నుంచి తుంగ‌భ‌ద్ర‌కు వ‌ర‌ద నీరు క్ర‌మంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్రాజెక్టుల కార‌ణంగా దిగువ ప్రాంత‌మైన తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని తెలిపింది. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని కూడా తెలంగాణ గుర్తు చేసింది.

More Telugu News