Chandrababu: అమిత్‌ షా, బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు లేఖలు

chandrababu writes letter to shah
  • మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ గురించి ప్ర‌స్తావ‌న‌
  • అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందన్న చంద్ర‌బాబు
  • చిత్తూరుకు తరలింపులో జాప్యం వెనక కూడా దురుద్దేశం ఉందని ఆరోప‌ణ‌
నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను నిన్న‌ చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేయ‌డంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఈ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌ను చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనక కూడా దురుద్దేశం ఉందని ఆయ‌న పేర్కొన్నారు.  

ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అన్నారు. అలాగే, వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ఘ‌ట‌న‌ను కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరోపక్క, నారాయణకు బెయిల్‌ లభించిన విష‌యం తెలిసిందే.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News