Mahesh Babu: సితారను రెచ్చగొట్టకండమ్మా!: మహేశ్ బాబు

Sarkaru Vaari Paata movie update
  • తన సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు 
  • సితారతో 'పెన్నీ'సాంగ్ చేయించింది తమన్ అంటూ వ్యాఖ్య 
  • తన డాన్స్ చూశాక గర్వంగా అనిపించిందని వ్యాఖ్య 
  • తప్పకుండా గొప్ప ఆర్టిస్ట్ అవుతుందంటూ కితాబు   
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. 'పెన్నీ' పాటలో సితార కనిపిస్తుందా? ఎండ్ టైటిల్స్ లో సితార పేరు వేశారా? అనే ప్రశ్నలు తాజా ఇంటర్వ్యూలో మహేశ్ కి ఎదురయ్యాయి. 

అందుకు మహేశ్ స్పందిస్తూ .. "ఈ సినిమాలోని 'పెన్నీ' మేకింగ్ వీడియోను సితారతో కూడా చేయిద్దామనే ఆలోచన చేసింది తమన్. ఆ విషయం తమన్ నాకు చెప్పినప్పుడు షూటింగులో ఉన్నాను. తమన్ కి నమ్రత ఓకే చెప్పేయడం .. షూటింగ్ చేసేయడం కూడా జరిగిపోయాయి. సితార డాన్స్ చూశాక తను గొప్ప ఆర్టిస్ట్ అవుతుందని అనిపించింది. 

సితారతో చేసింది ఓన్లీ మేకింగ్ వీడియోనే. అందువలన తను సినిమాలోని పాటలో కనిపించదు. "నేనెందుకు సినిమాలో లేను" అంటూ ఇప్పటికే తను నన్ను సతాయిస్తోంది. తన పేరు ఎండ్ టైటిల్స్ లో వేశారా ? అని మీరు అడుగుతున్నారు. ఈ మాట వింటే ఇప్పుడు మళ్లీ అదో పెద్ద గొడవై కూర్చుంటుంది. మీరు తనని ఉసిగొల్పకుండా ఈ టాపిక్ ని ఇంతటితో ఆపేయండి" అంటూ మహేశ్ నవ్వేశారు.
Mahesh Babu
Keerthi Suresh
parashuram
Sarkaruvari Pata

More Telugu News