Nirmala Sitharaman: ప్రసంగం మధ్యలో మంచినీళ్లు కోరిన ఉన్నతాధికారిణి... స్వయంగా తీసుకువచ్చి ఇచ్చిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman gives drinking water to NSDL MD Padmaja Chunduru on stage
  • ముంబయిలో ఎన్ఎస్ డీఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • హాజరైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
  • ప్రసంగించిన ఎన్ఎస్ డీఎల్ ఎండీ పద్మజ చుండూరు
  • దాహంతో ఇబ్బందిపడిన వైనం
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్ డీఎల్) సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ముంబయిలో ఓ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ చుండూరు ప్రసంగిస్తుండగా, మధ్యలో దాహం వేసింది. దాంతో నీళ్లు కావాలంటూ సిబ్బందికి సైగ చేశారు. కాగా, సిబ్బంది నీళ్లు తేవడంలో కొంచెం ఆలస్యం అయింది. 

అయితే, వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. ఎన్ఎస్ డీఎల్ ఎండీ పద్మజ దాహంతో ఇబ్బందిపడడాన్ని గుర్తించిన నిర్మలా... వెంటనే స్పందించారు. స్వయంగా తానే నీళ్లు తీసుకువెళ్లి ఆ మహిళా ఉన్నతాధికారికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి అయ్యుండి, ఎంతో మానవీయ కోణంలో స్పందించిన తీరు పట్ల నిర్మలా సీతారామన్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
Nirmala Sitharaman
Padmaja Chunduru
Drinking Water
NSDL
Silver Jubilee

More Telugu News