sugar: పంచదారకు స్టీవియా ప్రత్యామ్నాయమేనా..?

  • తీపిలో 100 రెట్లు ఎక్కువ
  • అయినా కేలరీలు సున్నా
  • ఆరోగ్యానికి కూడా మంచిదే
  • చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం
Is replacing sugar with stevia a wise call Nutritionist answers

పంచదారతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. బరువు పెరగడం, జీవక్రియలు గతి తప్పడం, మధుమేహం తదితర ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. చక్కర మితం దాటితే కొలెస్ట్రాల్ సమస్య, మధుమేహం ముప్పు పెరుగుతుందన్నది వాస్తవం. అందుకే మధుమేహం వచ్చిన వారు స్టీవియాకు మారిపోతున్నారు. ఇది ఒక చెట్టు ఆకుల నుంచి తీసుకునే తియ్యటి పదార్థం. పంచదార కంటే తీపి ఎక్కువ. రుచి మాత్రం భిన్నంగా ఉంటుంది. మరి చక్కెర బదులు స్టీవియా తీసుకోవచ్చా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఒక రోజుకు కావాల్సిన మొత్తం కేలరీల్లో 5 శాతానికంటే తక్కువ పంచదార రూపంలో ఉండేలా చూసుకోవాలని చెబుతోంది. కనుక పంచదారను తప్పకుండా తగ్గించుకోవాలి. స్టీవియా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ గా పిలిచే హై డెన్సిటీ లిపో ప్రోటీన్స్ (హెచ్ డీఎల్) ను పెంచుతుంది. సహజసిద్ధమైన, కేలరీలు లేకుండా తీపినిచ్చే స్టీవియాను వాడుకోవచ్చన్నది వైద్యుల సూచన. 

పంచదార కంటే స్టీవియా తీపి 100 రెట్లు అధికంగా ఉంటుంది. అయినా ఇది కేలరీలు లేని తీపి. దీనివల్ల ప్రయోజనాలను గమనిస్తే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. బరువు పెరిగే అవకాశాలను తగ్గిస్తుంది. జీవసంబంధిత క్రియల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదే. కనుక షుగర్ స్థానంలో స్టీవియాను వాడుకోవచ్చు.

More Telugu News