Virat Kohli: కోహ్లీ ఈ చెడు దశ నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను: రణ్ వీర్ సింగ్

ranveer on kohli batting
  • ఈ వైఫల్యాలతో కోహ్లీ స్థాయి పడిపోదన్న ర‌ణ్ వీర్ సింగ్
  • కోహ్లీ ఇలా తొలి బంతికే ఔటవ్వడం చూస్తుంటే బాధగా ఉందని వ్యాఖ్య‌
  • కోహ్లీ ఎప్పటికీ గొప్ప క్రికెటరేన‌ని కితాబు
బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్ర‌స్తుత ఐపీఎల్ సీజన్‌లో బాగా ఆడ‌ట్లేద‌న్న విష‌యం తెలిసిందే. నిన్న‌టి మ్యాచ్ లోనూ తొలి బంతికే కోహ్లీ  ఔటయ్యాడు. ఈ సీజ‌న్ ఐపీఎల్ లో కోహ్లీ ఇలా డకౌటవ్వడం ఇది ఆరోసారి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు అభిమానులు అండగా నిలుస్తున్నారు. కోహ్లీ రాణించ‌లేక పోతున్న‌ప్ప‌టికీ తాము మద్దతు తెలుపుతామని సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు చేస్తున్నారు.  

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్ వీర్ సింగ్ కూడా కోహ్లీకి మ‌ద్ద‌తు తెలిపాడు. కోహ్లీ ఇలా తొలి బంతికే ఔటవ్వడం చూస్తుంటే బాధగా ఉందని, అయితే, ఈ వైఫల్యాలతో ఆయ‌న‌ స్థాయి పడిపోదని చెప్పాడు. కోహ్లీ ఎప్పటికీ గొప్ప క్రికెటరేన‌ని అన్నాడు. కోహ్లీ ఈ చెడు దశ నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని, ఎందుకంటే రాబోయే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున కోహ్లీ ఆడి రాణించాలని ఎదురుచూస్తున్నాన‌ని చెప్పాడు.

Virat Kohli
Cricket
Bollywood

More Telugu News