Revanth Reddy: గుంటూరు, పుణేలో చదివావు... చప్రాసీ ఉద్యోగానికి కూడా అనర్హుడివే: కేటీఆర్ పై రేవంత్ ఫైర్

Revanth Reddy fires on KTR
  • ఇటీవల తెలంగాణలో రాహుల్ పర్యటన
  • విమర్శలు చేసిన కేటీఆర్
  • ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి
  • ఊరొదిలి పారిపోయిన చరిత్ర కేసీఆర్ సొంతం అంటూ సెటైర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పై నువ్వు ఏ హోదాతో మాట్లాడుతున్నావంటూ కేటీఆర్ ను నిలదీశారు. కేసీఆర్ కొడుకువి అనేదొక్కటే నీకున్న అర్హత అంటూ మండిపడ్డారు. గుంటూరు, పుణేలో చదివావు... ముల్కీ నిబంధనల ప్రకారం నువ్వు చప్రాసీ ఉద్యోగానికి కూడా అనర్హుడివేనని కేటీఆర్ పై రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

"రాహుల్ ను రాజకీయ టూరిస్టు అంటావా? మాకు మద్దతుగా నిలవడానికి వస్తే అర్హత ఏంటని అడుగుతారా? మరి మీ నాయన అందరి వద్దకు గింగిరాలు తిరగొచ్చా? నువ్వు బెంగాల్ ఎందుకు వెళ్లినట్టు? మహారాష్ట్ర ఎందుకు వెళ్లావు? మిమ్మల్ని దేశదిమ్మరులు అనాలా, బైరాగులు అనాలా?" అంటూ రేవంత్ నిప్పులు చెరిగారు. 

గ్రామం వదిలి పారిపోయిన చరిత్ర కేసీఆర్ దని, ఈ విషయం కేటీఆర్ తెలుసుకోవాలని అన్నారు. ఊరొదిలి పారిపోయిన మీరా గాంధీల కుటుంబాన్ని విమర్శించేది? మీరా గాంధీల కుటుంబంతో పోల్చుకునేది? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy
KTR
Rahul Gandhi
KCR
Congress
Telangana

More Telugu News