CM Jagan: ఈ నెల 13న నూతన మంత్రివర్గంతో సీఎం జగన్ భేటీ

CM Jagan will meet new cabinet
  • ఇటీవల ఏపీలో నూతన క్యాబినెట్
  • తొలిసారి సమావేశం కానున్న సీఎం జగన్
  • మరో రెండేళ్లలో ఎన్నికలు
  • మంత్రివర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే, నూతన మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ ఇప్పటిదాకా సమావేశం కాలేదు. ఇప్పుడా భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 13న సీఎం జగన్ కొత్త క్యాబినెట్ తో సమావేశం కానున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. 

ఈ నేపథ్యంలో, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గానికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో క్యాబినెట్ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News