Rashid Khan: నేడు మాతృదినోత్సవం... ఈ లోకంలో లేని తల్లి కోసం తీవ్ర భావోద్వేగాలకు లోనైన క్రికెటర్ రషీద్ ఖాన్

Rashid Khan painful post about his mother on Mothers day
  • రెండేళ్ల కిందట రషీద్ ఖాన్ తల్లి మృతి
  • నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
  • తన మనోవేదనను పంచుకున్న రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో తీవ్ర భావోద్వేగాలతో స్పందించాడు. రెండేళ్ల కిందట అనారోగ్యంతో రషీద్ ఖాన్ తల్లి కన్నుమూసింది. ఇవాళ మాతృదినోత్సవం సందర్భంగా రషీద్ ఖాన్... తల్లిని తలచుకుని తల్లడిల్లిపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న రషీద్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించాడు. 

"అమ్మా... నువ్వు మళ్లీ వచ్చేయమ్మా! నీ గొంతు వినాలని, నువ్వు నవ్వుతుంటే చూడాలని ఉందమ్మా! అమ్మా... నిన్ను గట్టిగా హత్తుకుని ఇంకెక్కడికీ వెళ్లనివ్వను. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉందమ్మా. నిన్ను నా జ్ఞాపకాల్లో చూసుకోగలను... అదెంతో సులువు కూడా. కానీ నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉందమ్మా. నువ్వు నాతో లేవన్న హృదయ వేదన ఎప్పటికీ నను వీడదు!" అంటూ తన మనోవేదనకు అక్షరరూపం ఇచ్చాడు.
Rashid Khan
Mother
Emotional
Mother's Day

More Telugu News