Jithender Reddy: బీజేపీ ఎక్కడుందని టీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు.. వారికి జ‌న‌మే జ‌వాబు ఇచ్చారు: జితేంద‌ర్ రెడ్డి

 Jithender Reddy slams trs
  • ఉదండాపూర్ ప్రాజెక్టు పనులు ఏమయ్యాయని నిల‌దీత‌
  • రిజర్వాయర్‌ ముంపు వాసుల నుంచి భూములు ప్ర‌భుత్వం లాక్కుంద‌ని విమ‌ర్శ‌
  • పునరావాసం, పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్న‌
టీఆర్ఎస్‌పై బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ఎక్కడుందని టీఆర్ఎస్ నేతలు అడుగుతున్నార‌ని, వారికి ఉదండాపూర్‌ జనమే సమాధానం ఇచ్చార‌ని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులు ఏమయ్యాయని, ఆ రిజర్వాయర్‌ ముంపు వాసుల నుంచి భూములు లాక్కున్న ప్ర‌భుత్వం పునరావాసం, పరిహారం ఎందుకు ఇవ్వలేదని ఆయ‌న నిల‌దీశారు. టీఆర్ఎస్ ను చూసి ఉదండాపూర్ ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు.

దేశంలో ప్ర‌ధాని మోదీ పాలనలో అవినీతిర‌హిత పాల‌న‌ కొనసాగుతోందని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా మత కల్లోలాలు, అవినీతి లేదని ఆయ‌న అన్నారు. తెలంగాణలో తాము మతతత్వాన్ని రెచ్చగొడుతున్నామ‌ని టీఆర్ఎస్ నేతలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.
Jithender Reddy
BJP
TRS

More Telugu News