Kim Sharma: ఖడ్గం సినిమా హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమవుతున్న టెన్నిస్ స్టార్?

Kim Sharma and Leander Paes likely to have a court marriage
  • కిమ్ శర్మ, లియాండర్ పేస్ వివాహంపై వార్తలు
  • ముంబైలో ఇరు కుటుంబాల మధ్య చర్చలు
  • కోర్ట్ మ్యారేజీకి అంగీకారం
ఖడ్గం సినిమాలో పెద్దగా మాటలతో పని లేకుండా చూపులతోనే నటించిన హీరోయిన్ కిమ్ శర్మ గుర్తుండే ఉంటుంది. టెన్నిస్ స్టార్ ఆటగాడు లియాండర్ పేస్.. కిమ్ శర్మ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. తాజాగా వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే సమాచారం వినిపిస్తోంది. కిమ్ శర్మ, లియాండర్ పేస్ తల్లిదండ్రులు ఇటీవలే ముంబైలో సమావేశమై వివాహం గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కోర్టు మ్యారేజ్ (రిజిస్టర్డ్ మ్యారేజ్) నిర్వహించాలని వీరు అంగీకారానికి వచ్చారు. 

లియాండర్ తన మొదటి భార్య రియా పిళ్లై నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కిమ్ శర్మకు దగ్గరయ్యాడు. అటు కిమ్ శర్మ కూడా కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విడిపోయింది. లియాండర్ కు తన మొదటి భార్యతో ఒక కుమార్తె కూడా ఉంది. 42 ఏళ్ల కిమ్ శర్మ, 48 ఏళ్ల లియాండర్ పేస్ వైవాహిక బంధంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
Kim Sharma
Leander Paes
marriage

More Telugu News