Ukrainian: మరో రష్యా నౌకను తునాతునకలు చేసిన ఉక్రెయిన్ డ్రోన్

Ukrainian drone destroys Russian ship near Snake Island in Black sea
  • నల్ల సముద్రంలో లంగరేసిన నౌకపైకి క్షిపణి దాడి
  • ధ్వంసమైన రష్యా యుద్ధ నౌక
  • వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ సైన్యం
అమెరికా, ఐరోపా దేశాలు ఇచ్చిన ఆయుధాల మద్దతుతో రష్యాకు గట్టి షాక్ లు ఇస్తోంది ఉక్రెయిన్. తాజాగా రష్యాకు చెందిన మరో నౌకను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. స్నేక్ ఐలాండ్ సమీపంలో నల్ల సముద్రంలో లంగర్ వేసి ఉన్న రష్యా నౌకపైకి ఉక్రెయిన్ ‘బైరక్టార్ బీ2’ డ్రోన్ ద్వారా క్షిపణిని విడుదల చేసింది. అది లక్ష్యాన్ని సూటిగా తాకడంతో నౌక ధ్వంసమై కాలిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు.

స్నేక్ ఐలాండ్ ప్రస్తుతానికి రష్యా నియంత్రణలోనే ఉంది. అక్కడి సెర్నా ప్రాజెక్టు ల్యాండింగ్ క్రాఫ్ట్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. రష్యాకు చెందిన రెండు క్షిపణీ నిరోధక వ్యవస్థలను సైతం బైరక్టార్ బీ2 ద్వారా దెబ్బతీసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. రష్యా యుద్ధ నౌకలకు భారీ నష్టం కలిగించడం ద్వారా తాము పైచేయి సాధించినట్టు ఉక్రెయిన్ గత నెలలోనే ప్రకటించడం గమనార్హం. 

Ukrainian
drone
attack
russia
ship
black sea

More Telugu News