Andhra Pradesh: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించాక మనస్పర్థలు.. ప్రేమికురాలి నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపి బెదిరింపులకు దిగిన సచివాలయ ఉద్యోగి

man send his lovers nude photos to her father as he rejected his request
  • విజయనగరం జిల్లాలో ఘటన
  • ఇంటి నిర్మాణానికి డబ్బులు అడిగిన ప్రేమికుడు
  • ఇవ్వకపోవడంతో బెదిరింపులు
  • అరదండాలు వేసిన పోలీసులు
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. అయితే, ఆ తర్వాత మనస్పర్థలు పొడసూపడంతో అమ్మాయి నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపి బెదిరింపులకు దిగాడో ప్రబుద్ధుడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. శీరెడ్డి నవీన్ స్థానిక గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అదే సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. 

ఇంత వరకు అంతా సవ్యంగానే సాగినా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. రెండు నెలల క్రితం వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ప్రస్తుతం తాను ఇల్లు కడుతున్నానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అయితే, డబ్బులు ఇవ్వలేమని యువతి తండ్రి చెప్పడంతో బెదిరింపులకు దిగాడు. అమ్మాయి నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపాడు. డబ్బులు ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Andhra Pradesh
Vizianagaram
Srungavarapu kota

More Telugu News