LSG: రాణించిన డికాక్, దీపక్ హుడా... కోల్ కతా ముందు భారీ లక్ష్యం

LSG set huge target to KKR
షార్ట్స్‌లో చూడండి
కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (50) అర్ధసెంచరీతో అలరించాడు. 29 బంతులాడిన డికాక్ 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు సాధించాడు. 

చివర్లో మార్కస్ స్టొయినిస్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 28 పరుగులు చేశాడు. అంతకుముందు, కృనాల్ పాండ్య 25 పరుగులు చేసి రసెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కోల్ కతా బౌలర్లలో రసెల్ 2, సౌథీ 1, శివం మావి 1, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
LSG
Target
KKR
IPL

More Telugu News