LSG: రాణించిన డికాక్, దీపక్ హుడా... కోల్ కతా ముందు భారీ లక్ష్యం

  • కోల్ కతా వర్సెస్ లక్నో
  • మొదట బ్యాటింగ్ చేసిన లక్నో
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు
  • డికాక్ అర్ధసెంచరీ.. 41 రన్స్ చేసిన హుడా
  • రసెల్ కు 2 వికెట్లు
LSG set huge target to KKR

కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (50) అర్ధసెంచరీతో అలరించాడు. 29 బంతులాడిన డికాక్ 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు సాధించాడు. 

చివర్లో మార్కస్ స్టొయినిస్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 28 పరుగులు చేశాడు. అంతకుముందు, కృనాల్ పాండ్య 25 పరుగులు చేసి రసెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కోల్ కతా బౌలర్లలో రసెల్ 2, సౌథీ 1, శివం మావి 1, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు.

More Telugu News