Garima Kaushal: 'ఇంద్రాణి' సినిమా నుంచి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్!

  • బహుభాషా చిత్రంగా 'ఇంద్రాణి'
  • ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న సినిమా 
  • టైటిల్ రోల్ ను పోషిస్తున్న గరిమా కౌశల్ 
  • అక్టోబర్ 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల 
Indrani Movie Update

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్‌గ‌ర్ల్ మూవీగా 'ఇంద్రాణి' రూపొందుతోంది  తెలుగు .. త‌మిళ‌ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాష‌ల‌లో ఈ ప్యాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించిన ' గరిమా కౌశల్' ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 

ఈ సంద‌ర్భంగా మేకర్స్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో గరిమా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందనీ, కథ మొత్తం కూడా ఆమె పాత్ర‌ చుట్టూనే తిరుగుతుందని పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశం, కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డ్రామా, డ్యాన్స్ నంబర్‌ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని స‌మ‌పాళ్ల‌లో కూడిన మొట్ట‌మొద‌టి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా 'ఇంద్రాణి' నిలుస్తుంద‌ని అన్నారు. 

ప్రస్తుతం 'ఇంద్రాణి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహ‌న్‌ సింగ్, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌, గ‌రీమా కౌశ‌ల్‌ ఈ సినిమా లో నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, స్టీఫెన్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను ప్ర‌పంచవ్యాప్తంగా అక్టోబ‌రు 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

More Telugu News