KKR: ఐపీఎల్: నేటి రెండో మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా

KKR won the toss against LSG
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన కోల్ కతా సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

ఈ మ్యాచ్ కోసం లక్నో జట్టులో ఒక మార్పు చేశారు. గౌతమ్ స్థానంలో అవేష్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఇక, కోల్ కతా జట్టులో కీలక బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయంతో వైదొలిగాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణాను తీసుకున్నట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. 

టోర్నీలో ఇప్పటిదాకా లక్నో, కోల్ కతా జట్ల ప్రస్థానం చూస్తే... లక్నో జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 10 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 7 విజయాలు సాధించింది. అటు, కోల్ కతా పరిస్థితి దయనీయం అని చెప్పాలి. 10 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
Go Back to Shorts
KKR
Toss
LSG
IPL

More Telugu News