Himanshu: స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన కేటీఆర్ తనయుడు హిమాన్షు

Kalvakuntla Humanshu Rao wins student council elections in Oakridge School
  • ఓక్రిడ్జ్ స్కూలులో చదువుతున్న హిమాన్షు
  • స్టూడెంట్స్ కౌన్సిల్ కు ఇటీవల ఎన్నికలు
  • ఫలితాలు వెల్లడించిన స్కూలు యాజమాన్యం
  • క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్ గా హిమాన్షు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే దిశగా ఇప్పటినుంచే అడుగులు వేస్తున్నట్టుంది. ఇటీవల హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో హిమాన్షు విజయం సాధించాడు. హిమాన్షు ఈ ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్ గా పోటీ చేశాడు. ఓక్రిడ్జ్ యాజమాన్యం ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిని తొలుత ఇంటర్వ్యూ చేసింది. కొందరితో తుది జాబితా రూపొందించి, వారికి ఓటింగ్ నిర్వహించింది. 

తుది జాబితాకు ఎంపికైన వారిలో హిమాన్షు కూడా ఉన్నాడు. తమకు ఎందుకు ఓటు వేయాలో స్కూలు ఓపెన్ ఫోరంలో హిమాన్షు ఇతర అభ్యర్థులు, విద్యార్థులకు వివరించారు. కొన్నిరోజుల కిందట ఓటింగ్ ప్రక్రియ జరగ్గా, ఓట్లను లెక్కించిన ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం ఫలితాలు వెల్లడించింది. ఇందులో హిమాన్షు క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ అధ్యక్షుడిగా విజయం సాధించగా, ఇతర విజేతలతో కలిసి శుక్రవారం బాధ్యతలు చేపట్టాడు. 

హిమాన్షు ప్రస్తుతం ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్నేషనల్ బకలారియేట్ డిప్లమా ప్రోగ్రామ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపడుతుంది. నిధులు సేకరించి బాధితులకు అందజేస్తుంది.
Himanshu
President
Creative Action Services
Students Council
Oakridge School

More Telugu News