TV5: టీవీ5 కార్యాలయంలో చంద్ర‌బాబు... ఎడిటోరియ‌ల్ సిబ్బందితో మాటామంతీ.. వీడియో ఇదిగో

  • చంద్రబాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన‌ బీఆర్ నాయుడు
  • టీవీ5 సిబ్బందిని స్వ‌యంగా ప‌ల‌క‌రిస్తూ సాగిన చంద్ర‌బాబు
  • చంద్ర‌బాబుతో ఉత్సాహంగా ఫొటోలు దిగిన సిబ్బంది
tdp chief chandrababu visits tv5 office in hyderabad

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శ‌నివారం హైద‌రాబాద్‌లోని టీవీ5 కార్యాల‌యానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా టీవీ5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్ర‌నాథ్, వైస్ చైర్మ‌న్ సురేంద్రనాథ్‌లు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పూర్ణ‌కుంభంతో ఆయ‌న‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నం ప‌లికారు. అనంత‌రం కార్యాల‌యంలో ఆయ‌న టీవీ5 ఎడిటోరియ‌ల్ సిబ్బందితో మాట్లాడారు. ఎడిటోరియ‌ల్ విభాగంలో చేస్తున్న వారంద‌రినీ ప‌ల‌క‌రించిన చంద్ర‌బాబు వారితో ఫొటోలు కూడా దిగారు. 

మూడు రోజుల పాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించిన అనంత‌రం శ‌నివారం హైద‌రాబాద్ చేరుకున్న చంద్ర‌బాబు సాయంత్రం వేళ టీవీ5 కార్యాల‌యానికి వెళ్లారు. చంద్ర‌బాబు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో టీవీ5 కార్యాల‌యంలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ‌తో నేరుగా చంద్ర‌బాబే మాట‌లు క‌ల‌ప‌డంతో టీవీ5 సిబ్బంది ఆనందంలో మునిగిపోయారు. ఇటు తెలంగాణ‌తో పాటు అటు ఏపీలోనూ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో టీవీ5 కార్యాల‌యానికి స్వ‌యంగా చంద్ర‌బాబు రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

More Telugu News