భానుడి ప్రతాపంతో తెలంగాణాలో 90 శాతం పెరిగిన బీర్ల అమ్మకాలు
- ఏప్రిల్ నెలలోనే 49,84,285 కేసుల బీర్ల విక్రయం
- ఇతరత్రా మద్యం అమ్మకాల్లో 3 శాతం పెరుగుదల
- సేల్ వాల్యూ ఆధారంగా చూస్తే మద్యం విక్రయాల్లో 19 శాతం పెరుగుదల
ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్లు కొనేస్తున్నారు.