Asaduddin Owaisi: స‌రూర్ న‌గ‌ర్‌లో నాగరాజు హ‌త్య కేసులో స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ

asaduddun on nagaraju murder case
  • నాగ‌రాజును ఆశ్రిన్ సుల్తానా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందన్న అస‌దుద్దీన్
  • అది సరైన చర్యేన‌న్న ఒవైసీ
  • సుల్తాన్ సోదరుడికి నాగ‌రాజును చంపే హక్కు ఎక్కడిదని ప్రశ్న  
హైద‌రాబాద్‌లోని స‌రూర్ న‌గ‌ర్‌లో దళిత యువకుడు నాగరాజును ఆయన భార్య సోద‌రుడు హత్య చేయ‌డాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. నాగ‌రాజును ఆశ్రిన్ సుల్తానా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందని, అది సరైన చర్యేన‌ని చెప్పారు. అయితే, సుల్తాన్ సోదరుడికి నాగ‌రాజును చంపే హక్కు ఎక్కడిదని ఆయ‌న నిల‌దీశారు. 

ఇటువంటి హ‌త్య‌లు చేయ‌డం రాజ్యాంగం ప్రకారమే కాకుండా ఇస్లాం ప్రకారం కూడా దారుణమైన నేరం అని ఆయ‌న చెప్పారు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌కు వేరే రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. హ‌త్య కేసులో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని తెలిపారు. తాము హంతకుల పక్షాన నిల‌బ‌డ‌బోమ‌ని చెప్పారు.
Asaduddin Owaisi
MIM

More Telugu News