TDP: చంద్ర‌బాబు కాన్వాయ్‌లో ప్ర‌మాదం... కారు నుంచి జారిప‌డ్డ కార్య‌క‌ర్త‌

  • కాకినాడ జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
  • గొల్ల‌ప్రోలులో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం
  • కాన్వాయ్‌లోని ఓ కారు ప‌ట్టుకుని సాగిన కార్య‌క‌ర్త‌
  • ప‌ట్టు త‌ప్పి ప‌డిపోయిన వైనం
accident in chandrababu convoy

ప్రస్తుతం కాకినాడ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కాన్వాయ్‌లో శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌మాదం చోటుచేసుకుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కాకినాడ జిల్లా చేరుకున్న చంద్ర‌బాబు.. గొల్ల‌ప్రోలులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. చంద్ర‌బాబు కాన్వాయ్‌లోని ఓ కారును ప‌ట్టుకుని ముందుకు సాగిన టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు ప‌ట్టు త‌ప్పి కారు నుంచి కింద ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో అత‌డికి తీవ్ర గాయాలు కాగా... పార్టీ శ్రేణులు అత‌డిని హుటాహుటీన ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

More Telugu News