Bojjala Gopala Krishna Reddy: టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

TDP leader Bojjala Gopala Krishna Reddy passes away
  • హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి
  • ఆయన వయసు 73 సంవత్సరాలు
  • శ్రీకాళహస్తి నుంచి వరుసగా ఐదు సార్లు గెలుపొందిన బొజ్జల
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే హైదరాబాదులోని బొజ్జల నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
Bojjala Gopala Krishna Reddy
Telugudesam
Dead

More Telugu News