YSRCP: న్యూ లుక్‌లో విజ‌య‌సాయిరెడ్డి... స‌జ్జ‌ల‌తో భేటీలో బ‌య‌ట‌కొచ్చిన‌ ఫొటో

ysrcp general secretary vijay sai reddy in new look
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంటులో ఆ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఓ కొత్త లుక్‌లో క‌నిపించారు. ఆయ‌న గుండు చేయించుకున్న త‌ర్వాత అప్పుడ‌ప్పుడే మొలుస్తున్న వెంట్రుకల‌తో స‌రికొత్త లుక్కులో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇలా గుండు చేయించుకున్న లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టిదాకా ఎప్పుడూ క‌నిపించ‌లేదు. ఈ లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. 

శుక్ర‌వారం నాడు వైసీపీకి చెందిన మ‌రో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో విజ‌య‌సాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీకి చెందిన ప‌లు అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య‌సాయిరెడ్డే ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. స‌జ్జ‌ల‌తో తాను భేటీ అయిన ఫొటోను కూడా ఆయ‌నే స‌ద‌రు ట్వీట్‌కు జ‌త చేశారు. 

Go Back to Shorts
YSRCP
Vijay Sai Reddy
Sajjala Ramakrishna Reddy

More Telugu News