విశాఖకు రాజధాని వద్దని చంద్ర‌బాబు అంటుంటే, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు?: అవంతి

Avanti srinivasrao slams chandrababu
  • జగన్, విజయసాయి ఏమి దోచుకున్నారో చంద్ర‌బాబు చెప్పాలని అవంతి డిమాండ్
  • చంద్రబాబుకు అమరావతి మీదే ప్రేమ ఉందని వ్యాఖ్య‌
  • విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలంటూ డిమాండ్ 
ఏపీ సీఎం జగన్ ది ఐరన్‌ లెగ్‌ అని, ఆయ‌న పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దివాలా తీసిందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత‌ అవంతి శ్రీనివాసరావు మండిప‌డ్డారు. శుక్రవారం విశాఖపట్నంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... జగన్ ది ఐరన్ లెగ్ అంటూ చంద్రబాబు చేసిన‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. 

సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విశాఖలో ఏమి దోచుకున్నారో చంద్ర‌బాబు చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అమరావతి మీదే ప్రేమ ఉందని అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వ‌ద్ద‌ని చంద్ర‌బాబు నాయుడు అంటే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఈ విష‌యంపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయ‌న నిల‌దీశారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాల‌ని, ఇలా చేస్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని ఆయ‌న స‌వాలు విసిరారు.
Go Back to Shorts
Avanthi Srinivas
YSRCP
Chandrababu

More Telugu News