Tirupati: తిరుపతిలో ధర్నాకు దిగిన వైసీపీ కార్పొరేటర్

  • ధర్నాకు దిగిన 20వ డివిజన్ కార్పొరేటర్ రాజమ్మ
  • తమ 88 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరులకు ఇచ్చారని ఆవేదన
  • ఆర్డీవో కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ పట్టా ఇచ్చేశారని మండిపాటు
YSRCP corporator sits in dharna against revenue officers

కొందరు రెవెన్యూ అధికారుల లీలలకు ప్రతిపక్ష పార్టీల నేతలే కాకుండా, అధికార పార్టీకి చెందిన వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రెవెన్యూ అధికారులు చేసిన నిర్వాకాన్ని నిరసిస్తూ తిరుపతి 20వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ రాజమ్మ, ఆమె కుమారుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకట మునిరెడ్డి ధర్నాకు దిగారు. 

తమ 88 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరులకు కట్టబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం 2016 నుంచి ఆర్డీవో కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. ఆర్డీవో కోర్టులో పెండింగ్ లో ఉన్న తమ భూమి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇతరులకు రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని చెప్పారు.

More Telugu News