Chandrababu: తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన నేటి షెడ్యూల్ ఇదే.. రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న టీడీపీ అధినేత!

Chandrababu schedule of East Godavari and Kakinada districts
  • మధ్యాహ్నం అన్నవరంలో మీడియా సమావేశం 
  • సాయంత్రం తాళ్లరేవు మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న బాబు
  • అనారోగ్యంతో బాధపడుతున్న నల్లమిల్లి మూలారెడ్డిని పరామర్శించనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన పర్యటన తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో కొనసాగనుంది. 

మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

చంద్రబాబు ఈనాటి పర్యటన షెడ్యూల్ వివరాలు:

  • ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కీలక నేతలతో భేటీ
  • 11 గంటలకు ప్రత్తిపాడు, తుని కార్యకర్తలతో సమావేశం
  • 11.30 గంటలకు చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీలో చేరే కార్యక్రమం
  • మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నవరంలో మీడియా సమావేశం
  • ఆ తర్వాత కత్తిపూడి, గొల్లప్రోలు, కాకినాడ భానుగుడి సెంటర్ లో ప్రసంగం
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాళ్లరేవు మండలం మాధవరాయుని పేటలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. అనంతరం స్థానికులతో సహపంక్తి భోజనం చేయనున్న బాబు
  • ఆ తర్వాత రామవరంకు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డికి పరామర్శ
  • రాత్రికి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాదుకు పయనం.

  • Loading...

More Telugu News